వెలిచాల జగపతిరావుపై గ్రూప్ 2 పరీక్షలో ప్రశ్నలు

నవతెలంగాణ – భగత్ నగర్ : కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నేత వెలిచాల జగపతి రావుపై గ్రూప్ 2 పరీక్షలో రెండు ముఖ్యమైన ప్రశ్నలు వచ్చాయి. నాలుగో పేపర్‌లో 52వ ప్రశ్నలో, ‘తెలంగాణ శాసన సభ్యుల ఫోరం’ ఎవరి నేతృత్వంలో ఏర్పడిందని అడిగారు. 1992లో, వెలిచాల జగపతి రావు కన్వీనర్ గా, జానా రెడ్డి చైర్మన్ గా, ఈ ఫోరం ఏర్పాటు చేయబడింది. అప్పటి 92 ఎమ్మెల్యేల సంతకాలతో, ప్రధాని పీవీ నర్సింహారావుకు వినంతి పత్రం సమర్పించారు. 55వ ప్రశ్నలో, జగపతి రావు యొక్క కీలక కార్యకలాపాల గురించి ప్రశ్నించారు. 1989లో కరీంనగర్‌లో తెలంగాణపై మూడు రోజుల సదస్సు నిర్వహించడం, జలసాధన సమితి ఉద్యమంలో సక్రమంగా పాల్గొనడం వంటి వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు వెల్లడించారు. తన తండ్రి యొక్క త్యాగం, పోరాట చరిత్రను కొత్త తరానికి తెలియజేసిన టీజీపీఎస్సీకి కృతజ్ఞతలు తెలిపారు.