ఆదిలాబాద్ ఐద్వా ఆధ్వర్యంలో సుశీల గోపాలన్ వర్ధంతి ..

Sushila Gopalan's death anniversary under Adilabad Aidwa..నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని సుందరయ్య భవనంలో ఐద్వా ఆధ్వర్యంలో సుశీలా గోపాలన్ 23వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ సందర్బంగా ఆమె చిత్ర పటానికి ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. సుశీల గోపాలన్ కేరళ చిరయింకిల్ (1991) నుండి మూడుసార్లు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారన్నారు. కొన్ని సంవత్సరాలు కేరళ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని, ముహమ్మాలోని చీరప్పంచిర అనే ప్రసిద్ధ కలరి కుటుంబంలో జన్మించిన ఆమె అలప్పుజా త్రివేండ్రంలో విద్యాభ్యాసం చేసి కమ్యూనిస్ట్ పార్టీలో చేరారని తెలిపారు. ఆమె 1952లో పార్టీ అనుభవజ్ఞుల్లో ఒకరైన ఎకె గోపాలన్‌ను వివాహం చేసుకుందని ఆయన అజ్ఞాతంలో ఉన్న సంవత్సరాల్లో ఆమె కలుసుకున్నారన్నారు. ఉద్యమ నిర్మాణంలో మహిళా అభ్యున్నతి కోసం వివక్షకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన దాంట్లో సమానత్వం కోసం బాధ్యతలు నిర్వహించిన అతికొద్ది మంది మహిళల్లో ఆమె ఒకరని గుర్తు చేశారు. కేరళలోని ఎల్‌డిఎఫ్ క్యాబినెట్‌లలో ఆమె మంత్రిగా ఉన్నారన్నారు. ఆమె చివరి కాలంలో పరిశ్రమలు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారని మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా కృషిచేశారన్నారు. మహిళా హక్కుల సాధనకోసం పోరాటం నిర్వహించడమే ఆమెకు నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోవే శకుంతల, లంక జమున, నాయకులు ప్రభావతి, మంజుల, పంచపుల, విజయ, ఆరిఫా, లలిత పాల్గొన్నారు.