– ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు మోర శ్రీకాంత్
– ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు.తంగళ్ళపల్లి మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని సభ్యులు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షుడిగా పూర్మాని రాంలింగా రెడ్డి,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మోర శ్రీకాంత్..(నవతెలంగాణ),ఉపాధ్యక్షుడిగా దుబ్బాక రాజు..(దిశ),ప్రధాన కార్యదర్శిగా రెడ్డి రాజశేఖర్..(ఆంధ్రప్రభ),కోశాధికారిగా గదగోని సాగర్..(బలగం),సహాయ కార్యదర్శిగా గ్యాదనవేని మధు..(క్యాపిటల్ ఇన్ఫర్మేషన్.. ఇంగ్లీష్ పేపర్),సాంస్కృతిక కార్యదర్శిగా రెడ్డిమల్ల దేవరాజు (నేటి తెలంగాణ),ముఖ్య సలహాదారులుగా సామల గట్టు (నమస్తే తెలంగాణ), వెంగల శ్రీనివాస్ (సాక్షి) ఏకగ్రీవమయ్యారు..ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మోర శ్రీకాంత్ మాట్లాడుతూ… తంగళ్ళపల్లి మండల ప్రెస్ క్లబ్ ను 2017 లో స్థాపించామని, అప్పటినుండి నేటి వరకు మండలంలోని పాత్రికేయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి పలు సమస్యలను పరిష్కరించుకున్నాం. నూతనంగా వచ్చిన కొందరు పాత్రికేయల కు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులకు పలువురు నాయకులు, అధికారులు,ప్రజా ప్రతినిధులు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలగం అనిల్ రావు పాల్గొన్నారు.