తూతుమంత్రంగా ఉపాధి సామాజిక ప్రజావేదిక 

నవతెలంగాణ – నసురుల్లాబాద్
మండలంలోని 17 పంచాయతీల్లో 2019 -22 లో జరిగిన సుమారు రూ 7,కోట్ల 15 లక్షల 91 వేల,343 రూపాయల విలువైన పనులపై సామాజిక తనిఖీ బృందం సభ్యులు సేకరించిన సమాచారం మేరకు డ్వామా అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సాయన్న, ఎంపిపి పాల్త్య విఠల్  అధ్యక్షతన సోమవారం స్థానిక రైతు వేదిక  కార్యాలయంలో బహిరంగంగా ప్రజావేదిక నిర్వహించారు. పనుల్లో జరిగిన అక్రమాలపై సంబంధిత ఉపాధి సిబ్బంది, గ్రామ కార్యదర్శుల నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. నసురుల్లాబాద్ మండలంలో17 గ్రామ పంచాయతీ పరిధిలో 944 పనులకు 5 కోట్ల 79 లక్షల 21 వేల 722 రూపాయలను కూలీలకు వేతనం చెల్లించారు. అలాగే వస్తువుల రూపంలో 1 కోటి 36 లక్షల 69వేల 621 రూపాయల ను ఖర్చు చేశారు. మండలంలో రూ 7,కోట్ల 15 లక్షల 91 వేల,343 రూపాయలను ఖర్చు చేశారు. పలు గ్రామాల కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యంగా వివరించడంతో మండలంలో వేలాది సంఖ్యలో మొక్కలు ఎండిపోయాయి పలుచోట్ల ధ్వంసం అయ్యాయి. అంకుల్ తండాలో పనులు రాసే పనులు చేసిన చోట పలకలు పెట్టకపోవడం 1800 మొక్కలు ఎండిపోవడం సంగం గ్రామంలో కూలీలకు వేతనం ఇవ్వడంలో జాప్యం మొక్కలు ఎండిపోవడం హాజీపూర్ గ్రామంలో జాబ్ కార్డు ఒకరిది పని మరొకరిది కూలి డబ్బులు ఇప్పించడంలో నిర్లక్ష్యం దుర్గి గ్రామంలో వందల సంఖ్యలో మొక్కలు ఎండిపోవడం ఇలా ప్రతి గ్రామంలో నాటిన మొక్కలు ఎండిపోవడం, సంతకాలు లేకుండా వేతనాలు ఇవ్వడం చేసిన పనులు ఫోటోలు లేకపోవడంపై దామర పీడీ ఉపాధి హామీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉపాధి పనులు జరిగిన ప్రదేశంలో నేమ్‌ బోర్డులు లేకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ నెంబర్ మజీద్, సొసైటీ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్, జడ్పిటిసి జన్నుబాయి ప్రతాప్ సింగ్, డీవీవో, ఏపీడీలు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం,  మండలస్థాయి అధికారులు, సర్పంచులు
ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, డీఆర్పీలు, సీఆర్పీలు, ఉపాధి హామి సిబ్బంది పాల్గొన్నారు.