
చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కల్లాటి మనుశ్రీ,గుడిపు దీపిక, పాము హారిక,ప్రేమ జ్యోతి అనే నలుగురు విద్యార్థినిలకు బాసర త్రిబుల్ ఐటీ లో సీట్లు వచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాల కు త్రిబుల్ ఐటి నాలుగు సీట్లు రావడం చాలా సంతోషంగా ఉందని ఇదంతా ఉపాధ్యాయుల సమిష్టి కృషి ఫలితంగానే నాలుగు సీట్లు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ముస్త్యాల హై స్కూల్ లో చదువుకున్న ఎందరో విద్యార్థిని విద్యార్థులు ఎన్నో ఉన్నతమైన శిఖరాలకు చేరుకున్నారని, ఒక మంచి గుర్తింపు ఉన్న పాఠశాలలో మా పిల్లలు చదువుకున్నందుకు తల్లిదండ్రులుగా మేమెంతో సంతోషిస్తున్నామని అన్నారు.భవిష్యత్తులో విద్యార్థులు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించి భవిష్యత్తులో పాఠశాల పేరు ప్రతిష్టలు కాపాడాలని సర్పంచ్ పెడతల ఎల్లారెడ్డి, ఎంపీటీసీ కమర్ సుల్తాన, ఎస్ఎంసి చైర్మన్ చింతల విజయ్ కుమార్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విద్యార్థుల కు శుభాకాంక్షలు తెలిపారు.


