‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరోమారు వెంకటేష్ అందర్నీ ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. ఇందులో ఆయన ఎక్స్ కాప్ పాత్రలో నటిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ ఆయన భార్యగా, మీనాక్షి చౌదరి ఆయన ఎక్స్ లవర్‌గా కనిపించ నున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు’ గ్లోబల్ టాప్ 20 వీడియోల లిస్టులోకి ఎంటరైంది.
సెకండ్ సింగిల్ ‘మీను’ ప్రోమో వెంకటేష్ పుట్టినరోజున విడుదలై ఫుల్ సాంగ్ కోసం కోసం ఉత్సాహాన్ని రేకెత్తించింది. తాజాగా గురువారం ఫుల్ సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయ్యే మరో మెస్మరైజింగ్ నెంబర్‌ని భీమ్స్ కంపోజ్ చేశారు. ‘నా లైఫులోనున్న ఆ ప్రేమ పేజీ..తీనా.. పేజీలో రాసి ఉన్న ఆ అందాల రాసి పేరు మీనా..’ అంటూ భార్యతో తన ప్రేమ కథను వెంకటేష్ వివరిస్తున్నట్లు ఈ పాట చిత్రీకరించారు. అనంత శ్రీరామ్ బ్యూటీఫుల్ లిరిక్స్ రాశారు. ప్రణవి ఆచార్యతో కలిసి భీమ్స్ అద్భుతంగా పాడారు. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.