
శనివారం రోజున మోపాల్ మండలంలోని తనకుర్ధి మరియు వివిధ గ్రామాలలో మొబైల్ యాప్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్న తీరును మండల పంచాయతీ అధికారి కిరణ్ పరిశీలించారు. సర్వే చేస్తున్న ప్రదేశానికి వెళ్లి లబ్ధిదారుల అనుమానాలను నీ వృత్తి చేశారు యాప్ లో ఎటువంటి తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలోని సర్వే సిబ్బందికి రోజుకి ఎన్ని కుటుంబాలు వివరాలను నమోదు చేస్తున్నారో అని అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేయాలని ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్జీదారుల ప్రతి ఒక్కరింటికి వెళ్లి సర్వే చేయాలని సర్వే విషయంలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా చూడాలని అని తెలిపారు. సర్వే విషయంలో ఎటువంటి సందేహాలు వచ్చినా కూడా తమను సంప్రదించాలని ఆయన తెలిపారు ఆయనతోపాటు గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటరమణ కారోబారి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.