– అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచె
నవతెలంగాణ-చిట్యాల
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం వెంచర్ల గ్రామ పంట పొలాల వద్ద అడవి పందుల కోసం అమర్చిన కరెంటు తీగలు తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శనివారం జరిగింది. ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. టేకుమట్ల మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన లోకిని గణేష్(24) శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంట్లో బయటకు వెళ్లాడు. శనివారం ఉదయం 7గంటల సమయంలో వాట్సప్ గ్రూప్‌లలో తన భర్త లాగే ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని చూసి వెతుక్కుంటూ గణేష్ భార్య వెళ్లింది. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప కరెంట్ వైర్లు తగిలి మృతిచెందాడు. ఆ పక్కనే ఒక అడవి పంది చనిపోయి ఉందని మృతుడి భార్య అపర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన సీఐ మల్లేష్ యాదవ్, ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్ పరిశీలించి వివరాలు సేకరించారు.