ప్రతి అయ్యప్పలో అయ్యప్ప దేవుడు కనిపిస్తాడు..

God Ayyappa appears in every Ayyappa.– చోల్లోరులో అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం

– పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
ఎవరైతే అయ్యప్ప కొండకు పోరో, ఎవరైతే స్వామివారిని దర్శించుకోరో వారందరికీ ఈ ప్రతి ఒక్క అయ్యప్పలో  అయ్యప్ప స్వామి కనిపిస్తాడు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం, యాదగిరిగుట్ట మండలం చోల్లేరు, అయ్యప్ప స్వాముల ఇరుముడి, పడి పూజలో బీర్ల ఐలయ్య  పాల్గోన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొని పడి మెట్ల పై జ్యోతిలను వెలిగించారు. అనంతరం 41రోజులు మండల దీక్ష చేసిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఊర్లో కూడా దివ్యంగా ఉండాలని  కఠినమైన దీక్ష చేస్తూ స్వామివారిని చేరుకోవడానికి పెద్ద మహా పడిపూజ చేసి ఇక్కడి నుండి మనందరి ద్వారా శబరిమలై కొండలు ఎక్కడానికి పోతున్నటువంటి అయ్యప్ప స్వాములకు స్వామి శరణం స్వామి శరణం….. స్వామి నామస్మరణయే ముఖ్యంగా, స్వామి ఆశీస్సులే ముఖ్యంగా 41 రోజులు కఠినమైన దీక్ష చేసిన స్వాములందరిలో కూడా మనం అయ్యప్పను చూసుకోవాలని అన్నారు. స్వాములు అందరికీ కూడా అయ్యప్ప ఆశీస్సులు ఉంటాయని అన్నారు. ఇంత పెద్ద గ్రామంలో పట్టణ వాతావరణం ఏ ఇంట్లో చూసినా అయ్యప్ప నామస్మరణ, ఏ ఇంట్లో చూసినా అయ్యప్ప భజన కనిపిస్తుందని అన్నారు. అయ్యప్ప ఆశీస్సులు మన ఆలేరు నియోజకవర్గం ప్రజలకు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజ్ గౌడ్, మాజీ ఎంపిటిసి కోక్కలకొండ అరుణ నిమ్మయ్య, కళ్లెం వెంకటేష్, తోటకూరి వెంకటేష్, డప్పు మల్లేష్, చిన్నం శ్రీనివాస్, చిన్నం శ్రీకాంత్, ఈదులకంటి బాబు, గడ్డమీద శ్రీధర్, తోటకూరి శ్రీశైలం, సిద్ధిరాములు, దొంతి సారం నవీన్, బోడ శివకుమార్, కుండే సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.