మండలంలోని పొన్కల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న బీసీ హాస్టల్ కు వెళ్లే దారిని పంచాయతీ ఈవో రాహుల్ శుభ్రం చేయించారు. ఆ హాస్టల్ కు వెళ్లే దారి పూర్తిగా ముళ్ల చెట్లతో నిండిపోవడంతో ఆ మార్గంలో నడిచేందుకు హాస్టల్ నిర్వాహకులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పలు సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు ఈవో రాహుల్ సోమవారం ట్రాక్టర్ బ్లేడ్ సహాయంతో బీసీ హాస్టల్ రహదారి మార్గాన్ని శుభ్రం చేయించారు. సందర్భంగా ఈవో రాహుల్ హాస్టల్ వాడెన్ రమేష్ ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.