నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉన్నత విద్యామండలి చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆర్ లింబాద్రిని సోమవారం హైదరాబాద్‌లో ఏపీ మంత్రి మెరుగు నాగార్జున కలిసి అభినందనలు తెలిపారు. ఉన్నత విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జునను శాలువా కప్పి పుష్పగుచ్చడం అందించి లింబాద్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మెన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు.