పట్టణంలోని బస్టాండులో మదర్ ఫీడింగ్ బాక్స్‌ను లయన్స్ క్లబ్ మంచిర్యాల జిల్లా గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. బుధవారం ఆయన బస్టాండులో ఫీడింగ్ బాక్స్ ను ప్రారంభించి మాట్లాడారు. తల్లులు తమ చిన్నారులకు ఇబ్బంది పడకుండా పాలను ఇవ్వడానికి ఫీడింగ్ బాక్స్ ఉపయోగపడుతుందన్నారు. ఫీడింగ్ బాక్స్ ఏర్పాటు చేయడానికి సహకరించిన పొన్కల్ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్‌ను అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కస్తూరి సతీష్, సందీప్, జగదీష్, వాలేటి శ్రీనివాస్, అంజిత్ రావు శ్రీకాంత్ రెడ్డి జక్కు భూమేష్ ఉన్నారు.