హీరో ప్రదీప్ మాచిరాజు తన రెండవ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో అలరించ డానికి రెడీ అవుతున్నారు. డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పిల్లి నాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, ఫస్ట్సింగిల్కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి బజ్ నెలకొంది. క్రిస్మస్ సందర్భంగా మేకర్స్ ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవి నటించిన సెకండ్ సింగిల్ ‘టచ్‌లో ఉండు..’ సాంగ్‌ని విడుదల చేసారు. ఈ పాటలో చంద్రిక రవి లైవ్లీ, కలర్‌ఫుల్ సెట్టింగ్‌లో ప్రదీప్ మాచిరాజుతో కలిసి డ్యాన్స్ చేస్తూ గ్లామర్‌ను యాడ్ చేసింది. ప్రదీప్ తన డైనమిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నాడు. చంద్రబోస్ రాసిన మాస్ లిరిక్స్ అలరించాయి. లక్ష్మీ దాస, పి రఘు ఎనర్జిటిక్ వోకల్స్ ఈ పాటను ఫ్యాన్స్ అఫ్ మాస్ హిట్ చేశాయి. ఆకట్టుకునే రిథమ్, వైబ్రెంట్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఈ సినిమా థియేటర్లలో విడుదలకు ముందే మ్యూజిక్ సెన్సేషన్‌గా మారుతోంది అని చిత్ర బృందం తెలిపింది.