– నేడు సౌరాష్ట్రతో హైదరాబాద్ ఢీ
అహ్మదాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ పరుగుల వేటపై దృష్టి సారించనున్నాడు. టీ20 ఫార్మాట్‌లో భీకర ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ..50 ఓవర్ల ఆటలో తొలి రెండు మ్యాచుల్లో పరుగుల ఖాతా తెరువలేదు. గ్రూప్-సిలో నేడు సౌరాష్ట్రతో కీలక మ్యాచ్‌లో తిలక్ వర్మ ఫామ్‌పైనే ఫోకస్ కనిపిస్తోంది. యువ ఆటగాడు అవనీశ్ రావు నిలకడగా రాణిస్తుండగా.. సీనియర్ బ్యాటర్లు తన్మరు అగర్వాల్, అభిరాత్ రెడ్డి బాధ్యతగా ఆడుతున్నారు. టాప్ ఆర్డర్‌లో తిలక్ వర్మ రాణిస్తే హైదరాబాద్‌కు బ్యాటింగ్ కష్టాలు ఉండవు. సివి మిలింద్, రోహిత్ రాయుడు, అజరు దేవ్ గౌడ్‌లు అంచనాలను అందుకోవాల్సి ఉంది. సౌరాష్ట్ర తరఫున కెప్టెన్ జైదేవ్ ఉనద్కత్, షెల్డన్ జాక్సన్, చిరాగ్ జాని, రుచిత్ అహిర్‌లు ఫామ్‌లో ఉన్నారు. హైదరాబాద్, సౌరాష్ట్ర మ్యాచ్ ఉదయం 9 గంటలకు ఆరంభం కానుంది. ఇక నేడు హైదరాబాద్ వేదికగా గ్రూప్-ఈలో బెంగాల్-త్రిపుర, బిహార్-ఢిల్లీ, కేరళ-మధ్యప్రదేశ్ తలపడనున్నాయి.