అనగనగా ఒక రాజు పెళ్ళి..

That is, the marriage of a king..నవీన్‌ పొలిశెట్టి నటిస్తున్న నూతన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తోంది. నవీన్‌ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ప్రీ వెడ్డింగ్‌ వీడియో టీజర్‌ను నిర్మాతలు రిలీజ్‌ చేశారు. ప్రీ వెడ్డింగ్‌ వీడియోలో నవీన్‌ పొలిశెట్టి పోషించిన రాజు పాత్ర తన వివాహానికి సిద్ధమవుతున్నట్లు చూపించారు. రాజు పెళ్ళి అంటే ఎలా ఉండాలి? అనే దాన్ని ఓ రేంజ్‌ చూపిస్తూనే, కాబోయే భార్యతో దిగే ఫొటో సెషన్‌ని వినోదాత్మకంగానే చూపించారు. మీనాక్షి చౌదరితో నవీన్‌ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. నూతన దర్శకుడు మారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం నూతన సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపారు.