100 రోజుల పనిని గ్రామాలకు అందించిన మన్మోహన్ సింగ్..

Manmohan Singh gave 100 days of work to villages.– మన్మోహన్ సింగ్ ఆయన ఆర్థిక విధానాలు దేశంలోని పేదరికం తగ్గించాయి..
– కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నాయకున్ని కోల్పోయింది: కొయ్యడ శ్రీనివాస్, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
నవతెలంగాణ – పరకాల
ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశం ఒక మంచి మాజీ ప్రధాని కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకున్ని కోల్పోయిందని, దేశ ప్రధానిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలాగా దేశ ప్రజలందరికీ సమాన న్యాయం చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన మరణం దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. సాధారణ కుటుంబంలో పుట్టి ఆయన గొప్ప ఆర్థికవేత్తగా ఎదగారు. దేశ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశారు. దూరదృష్టి కలిగిన రాజనీతియజ్ఞుడు రాజా నీతి అజ్ఞుడిని దేశం కోల్పోయింది. ఆయన ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయి. మార్గదర్శకుడిని కోల్పోయాము అపార జ్ఞానం సమగ్రతతో ఆయన దేశాన్ని నడిపించారు. ఆర్థిక సంస్కరణలు జిడిపి వృద్ధిలో ఉరకలు వేయించారు. దివాలా స్థాయి నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అగ్ని పరీక్షలో పివి గారి వెంట ఉండి భారత్ ను గట్టెక్కించిన ఆర్థిక బంధం వారిది. దేశ గతిని, స్థితిని మార్చిన 1991 బడ్జెట్ నెల రోజుల్లోనే తయారుచేసిన మహాన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశీలి మన్మోహన్ సింగ్. ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని కొయ్యడ శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో   సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాలగోనాథ్, మెరుగు శ్రీశైలం, బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడెల్లి సదన్ కుమార్, పరకాల ఉమ్మడి మండల మీడియా ఇంచార్జ్ ధర్నా వేణుగోపాల్, లక్కం వసంత, ఎండి షఫీ, సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డం శివ, పసుల భద్రయ్య గోవింద, సురేష్, సుధమల్ల కిషోర్, గూడెల్లి రంజిత్, దుప్పటి రాజేష్, సుధామల్ల రమేష్, ములుగురి శ్రీనివాస్, బొచ్చు కుమార్, తదితరులు పాల్గొన్నారు.