రేపు ఒకపూట సెలవు

నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకపూట సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. ఇప్పటికే 7 రోజుల పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఇవాళ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.