మావోయిస్టు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్పీ శబరిష్

నవతెలంగాణ-గోవిందరావుపేట : మండలంలోని ముద్దులగూడెం గ్రామానికి చెందిన కొయ్యడ సాంబయ్య మావోయిస్టు కుటుంబాన్ని శుక్రవారం జిల్లా ఎస్పీ శబరిష్ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. పోరుకన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శబరిస్ మావోయిస్టు రాష్ట్ర నాయకుడు కొయ్యడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబా ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని బియ్యము నిత్యవసర వస్తువులను అందించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులైన భార్య పిల్లలు అందరికీ దూరంగా అక్కరకు రాని సిద్ధాంతాలతో సాధించేది ఏమీ లేదని కష్టకాలంలో కుటుంబాన్ని ఆదుకోవడం మంచిదని లొంగిపోయిన వారికి ప్రభుత్వం ప్రకటించిన పారితోషకం తో ఉజ్వల భవిష్యత్తు కొరకు  రుణ సహాయం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  డిఎస్పి రవీందర్, సీఐ రవీందర్ ఎస్సై కమలాకర్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.