రెంజల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఎంపీడీవో వెంకటేష్ జాదవ్ శనివారం మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. చిన్నారులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన చిన్నారులతో పాటు కూర్చొని భోజనం చేశారు. ఆయన వెంట సూపర్డెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.