సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపిక..

Model school students selected for CM Cup state competition.– మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సరిత 

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికయ్యారని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సరిత ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 16 నుండి 21 వరకు జరిగిన కరీంనగర్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల లో పాల్గొని ప్రథమ స్థాయిలో నిలవడమే కాకుండా రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని,ఈనెల 27 నుంచి 29  మెదక్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడల్లో  సాఫ్ట్ బాల్ పోటీలలో బాలుర విభాగం నుంచి పి. అనిల్,బి. ప్రవీణ్,లు అలాగే బాలికల విభాగంలో కే .అర్చన, జి .సాయి తేజ,లు పాల్గొననున్నారు. విద్యార్థులు కష్టపడి రాష్ట్రస్థాయి విజేతలుగా నిలిచి , మోడల్ స్కూల్ ప్రతిభను రాష్ట్రస్థాయిలో నిలపాలని ప్రిన్సిపాల్ వి. సరిత ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే విద్యార్థుల  క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న పీ.ఈ.టీ లు మోహన్, తిరుపతి లను అభినందించారు.