మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులర్పించిన ఐకెపి సిబ్బంది..

IKP staff paid tribute to Manmohan Singh.నవతెలంగాణ – రెంజల్

స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి ఎనలేని సేవ అందించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఐకెపి సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం చిన్నయ్య, సీసీలు భాస్కర్, కృష్ణ, శ్యామల, శివకుమార్, సునీత, కంప్యూటర్ ఆపరేటర్ తస్లీమా, అటెండర్ మమత తదితరులు పాల్గొన్నారు.