నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రముఖ ప్రజా కవి గాయకులు వరంగల్ శ్రీనివాస్ గారు రచించిన నూరేండ్ల నా ఊరు గేయకావ్యం ఓయమ్మ నా పల్లెసీమ కోసం గాయనీ గాయకుల ఎంపిక కార్యక్రమం 30-12-2024 సోమవారం రోజున ఉదయం 10గంటల నుండి కొత్త అంబేద్కర్ భవన్ ఖలీల్వాడి లో నిర్వహిస్తున్నట్లు నూరేండ్ల నాఊరు కళానేతలు అష్ట గంగాధర్ తెలిపారు. ఈ మేరకు శనివారం నగరంలోని కేర్డిగ్రీ కళాశాల ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ కేంద్రంలో అట్టహాసంగా జరుగుతుంది కావున ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఆసక్తి ఉన్న గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని మీ ప్రతిభతో ఈ గేయ కావ్యంలో పాడే అవకాశాన్ని పొందగలరు. 243 చరణాలు కలిగిన ఈ గేయకావ్యంలో 243 మంది ప్రతిభావంతులైన గాయనీ గాయకులచే పాడించచబడునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేర్ డిగ్రీ కళాశాల అధినేత నరాల సుధాకర్, నూరేండ్ల నాఊరు కళానేతలు అష్ట గంగాధర్, రెలారే గంగా, నరాల సుధాకర్, రాంపూర్ సాయి, సాయి లవోల, లక్క క్రాంతి, సవిత,దివ్య , మహేందర్, రమేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.