‘మెయిలూ వచ్చే.. కార్డూ పోయే’

'Mails come...cards go'ఆప్యాయతలోని అనుబంధాన్నీ
అనురాగంలోని మాధుర్యాన్నీ
ప్రణయంలోని పరిమళాన్ని
అక్షరాలా పెనవేసి ముడివేసే హరివిల్లు
సందేశాల పాదరిల్లు-
గ్రీటింగ్‌ కార్ట్‌

ముత్యం మెరుస్తుంది..
జ్ఞాపకం మురిపిస్తుంది..
ఆనందం మైమరిపిస్తుంది..
సుమం శోభిస్తుంది.. దరహాసం శోభనిస్తుంది..
అయితే… వీటన్నింటినీ మైమరిపిస్తుంది..
ఒకే ఒక్క గ్రీటింగ్‌ కార్డ్‌ హదయ స్పందనని తెలియ చెప్పే
చిన్ని సంతకం అందంగా అడ్డుకునే రంగుల కాగితం
వీటన్నింటినీ ఇముడ్చుకునే అందమైన కవరు
చుట్టూ కౌగమించుకునే సన్నపాటి లేనూ
వీటన్నింటి అలంబనే గ్రీటింగ్‌ కార్డ్‌ –
”మెయిలూ వచ్చే.. కార్డూ పోయే”
అంతర్జాల మాయలో గ్రీటింగ్‌ కార్ట్‌ మాయమైంది.
మెసేజ్‌ ల వలలో గ్రీటింగ్‌ కార్డ్‌ మూలపడింది.
సెల్‌ సందేశంలో ‘ఆనవాయితీ’ కనిపిస్తే
గ్రీటింగ్‌ కార్డ్‌ వాక్యాల్లో ‘అత్మీయత వెల్లివిరుస్తుంది.
కాలచక్ర వేగంలో కొట్టుకుపోతూ
గ్రీటింగ్‌ కార్డ్‌ చేజార్చుకుంటున్నాం
సున్నితమైన అనుభూతుల్ని మిస్సయిపోతున్నాం.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి (హైదరాబాద్‌)