మిస్‌ ఫైర్‌

ఆయా సందర్భాలను బట్టి తన పాత్రను బయటకు తీస్తాం. అన్నిచోట్ల ఒకేరకంగా కాకుండా అక్కడి పరిస్థితులను బట్టి నడవడికలో తేడా చూపుతాం. అలా వ్యవహరించని వ్యక్తిని చూసి జనం నవ్వుకుంటారు. చావుకాడ, పెండ్లికాడ, ఘర్షణకాడ ఒకే రకంగా ఉండం. చావుకాడ ఏడుస్తూ… పెండ్లికాడ నవ్వుతూ… ఘర్షణకాడ ఆవేశంగా ఉంటాం. ఈ మూడు సందర్భాలే కాదు.. నిత్యజీవితంలో అనేక సందర్భాలుం టాయి. అదేందోగానీ ఈ చిన్న లాజిక్‌ హీరోలా ప్యాన్స్‌ మాత్రం చావుకాడ, పెండ్లికి ఒకే భజన చేస్తున్నారు. అభిమానం వెర్రి వేషాలేస్తోంది. కొన్ని సార్లు వారి అభిమాన కథానాయకులు, నాయకీ కూడా తీవ్ర అసౌకర్యానికి గురియ్యేలా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో కథానాయకులు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ ఎంపీడీవోను పరామర్శిం చేందుకు ఏపీ ఉప ముఖ్య మంత్రి పవన్‌కళ్యాణ్‌ ఆస్పత్రికి వెళ్లారు. అది పెండ్లి పేరంటం కాదు… ఈవెంట్‌ అంత కంటే కాదు. అదో బాధకర మైన సంఘటన. పవన్‌ కళ్యాణ్‌ భావోద్వేగంతో ఉన్నారు. బాధితుడికి ధైర్యం చెబుతున్నారు. తమ అభిమాన కథా నాయకుడు వచ్చారని తెలుసు కున్నా… అభిమా నాలు కుప్పలు, తెప్పలుగా అక్కడికి చేరుకున్నారు. వచ్చారు… చూశారు… కానీ వెళ్లిపోలేదు. అక్కడ ఓజీ… ఓజీ… ఓజీ అంటూ పెద్ద పెట్టున నివాదాలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ది ఓజీ రాబోయే చిత్రం. ప్రస్తుతం ఆయన నటిస్తున్నారు. ఆయన ఓ వ్యక్తిని పరామర్శిస్తున్న సందర్భంలో అభిమానులు వెనుకా ముందు చూసుకోకుండా ఓజీ అని నినాదాలు చేయడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా అభిమానుల తీరు చావుకు… పెండ్లికి ఒకేలా వ్యవహరించినట్టు ఉందని నెటిజన్లు అంటున్నారు.
– గుడిగ రఘు