గాయాన్ని దాచుకోవడం
ఒక కళ !
కన్నీళ్ళు ఆపుకోవడం
ఒక మెళకువ !
ఇది రద్దీగా వుండే
నగరంలోని సెంటర్,
జనం కళ్ళబడితే,
రక రకాల కథలల్లి బద్నాం చేస్తారు !
మాటల్లో చేతల్లో
వొణుకు రాకుండా వుండడం నిబ్బరం!
శిథిలాల దగ్గర నిలుచున్నా
చందమామను చూడడం జీవితం !
మారే వయసులో, సాగే కాలంలో
మార్పు చిత్రంగా వుంటుంది
కలలు, కోరికలు, కోపాలు
మునిగిన పడవలా వుండి పోతాయి
గడిచిన క్షణాలు
అలసి పోయి వుంటాయి
తడిసిన కళ్ళు బరువుగా వుంటాయి
ఆలోచనలు రెక్కలు తెగి వుంటాయి
చిమ్మ చీకట్లో వొంటరిగా
దీపం కోసం రాత్రి,
లోకమంతా గాలిస్తుంది
– ఆశారాజు,
9392302245