– ఫైనల్లో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం
పుణె (మహారాష్ట్ర) : హర్యానా స్టీలర్స్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం పుణెలో జరిగిన పీకెఎల్ 11 ఫైనల్లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై 32-23తో హర్యానా స్టీలర్స్ ఘన విజయం సాధించింది. గత సీజన్ ఫైనల్‌కు చేరినా టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయిన హర్యానా స్టీలర్స్.. ఈసారి వదల్లేదు. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడిన స్టీలర్స్ కూతలో, పట్టులో పైరేట్స్‌పై పైచేయి సాధించింది. 15-12తో ప్రథమార్థంలో ముందంజ వేసిన స్టీలర్స్.. ద్వితీయార్థంలో మరింత దూకుడు చూపించింది. పట్నాను ఓ సారి ఆలౌట్ చేసి తిరుగులేని ఆధిక్యం సాధించింది. స్టీలర్స్ తరఫున శివమ్ (9), మహ్మద్‌రెజా (7), వినరు (6), రాహుల్ (3), జైదీప్ (2) సమిష్టిగా మెరిశారు. పట్నా పైరేట్స్ ఆటగాళ్లలో గుర్దీప్ (6), దేవాంక్ (5), అయాన్ (3) మెరిసినా..9 పాయింట్ల తేడాతో పరాజయం తప్పలేదు. హర్యానా స్టీలర్స్‌కు ఇది తొలి టైటిల్ విజయం.