జాతీయ ఫెన్సింగ్‌ పోటీలకు 24 మంది ఎంపిక

జాతీయ ఫెన్సింగ్‌ పోటీలకు 24 మంది ఎంపికహైదరాబాద్‌ : జాతీయ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు తెలంగాణ నుంచి 24 మంది ఫెన్సర్లు ఎంపికయ్యారు. డెక్కన్‌ ఫెన్సింగ్‌ క్లబ్‌లో జరిగిన క్యాడెట్‌ అండర్‌-17 సెలక్షన్‌ ట్రయల్స్‌లో 49 మంది పోటీపడగా, ప్రతిభావంతులైన జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ‘ఫెన్సింగ్‌ క్రీడకు ఉజ్వల భవిష్యత్‌ ఉంది. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలు అభివృద్ది చెందితేనే భారత్‌ క్రీడా దేశం ఎదుగుతుందని’ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. జాతీయ పోటీలకు ఎంపికైన ఫెన్సర్లను సెలెక్షన్‌ కమిటీ సభ్యుడు ఎల్‌.సందీప్‌ కుమార్‌ జాదవ్‌ అభినందించారు.