నవతెలంగాణ – భువనగిరి
మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేల ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మిషన్ భగీరథ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ముఖ్య నాయకుల సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షులు సి హెచ్ శ్రీను అధ్యక్షతన స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ నిత్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్న మిషన్ భగీరథ కార్మికుల జీతాలు మాత్రం 10 వేలకు పైగా పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న కనీసం ప్రమాద భీమా సౌకర్యం లేదని 20 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేని పేస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా జనవరి 06 న సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు సి హెచ్ శ్రీను,కమిటీ మెంబర్స్ సంపత్ కుమార్ ,ప్రసాద్ సురేష్, మహేష్, వి.జంగయ్య , కుమారస్వామి, యాదగిరి, S. జంగయ్య పాల్గొన్నారు.