నవతెలంగాణ-రామగిరి : సింగరేణి ఆర్ జి-3 ఏరియాలోని ఓసిపి-2లో పిట్ సెక్రటరీ రామిండ్ల మనోహర్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ ఆర్ జి-3 ఏరియా వైస్ ప్రెసిడెంట్, కోట రవీందర్ రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ, ఎంఆర్ సి రెడ్డి, బేస్ వర్క్ షాప్ ఫిట్ సెక్రెటరీ, కె ఎన్ చారి, సెంట్రల్ కమిటీ నాయకులు ఉయ్యాల కుమారస్వామి, గని మేనేజర్ కెవి రామారావు, ప్రాజెక్ట్ ఆఫీసర్, వెంకటరమణ, వెల్ఫేర్ ఆఫీసర్ మురళి, ప్రీతి, రంజాబి అన్ని యూనియన్ల పిట్ సెక్రటరీలు ముఖ్య కార్యకర్తలు అధికారులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.