నవతెలంగాణ నవాబ్ పేట : మండల కేంద్రంలో 28 తేదీన నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ కారూర్ గ్రామానికి చెందిన లోక్రేవు నర్సింలు తండ్రి లక్ష్మయ్యను జిల్లా కోర్టులో హాజరు పరిచగా మహబూబినగర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శశిధర్ ముందు ప్రవేశపెట్టగా 2 రోజుల జైలు శిక్ష మరియు 1000/- రూపాయల జరిమానావిధించారని ఎస్సై విక్రమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వెయ్యి జరిమానా రెండు రోజుల పాటు జైలు శిక్ష ఉంటుంది అని సూచించారు.