కొత్త ఏడాది.. కొత్త నిర్ణ‌యాలు

New Year.. New Resolutions2024… ఎన్నో ఆనందాలను.. కొన్ని చేదు జ్ఞాపకాలను మనకు మిగిల్చి వెళ్లిపోతోంది. నూతన ఉత్సాహంతో మరో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాము. తమ శక్తిసామర్థ్యాలను నిరూపించున్న మహిళలు మన మధ్య ఎందరో ఉన్నారు. రాబోయే కొత్త ఏడాదికి మహిళా సాధికారతకు వారు చిహ్నంగా నిలిచారు. 2024 ఏడాదికి గాను హార్పర్స్‌ బజార్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఈవార్డు అందుకున్న వారి పరిచయాలు క్లుప్తంగా…
కొత్త ఏడాది మొదలయింది. ఈ మధుర క్షణాలను ఆస్వాదించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. గడియారంలోని రెక్కల చప్పుడు గుండెల్లో వినిపించే క్షణాలని ఆస్వాదించే ఉంటారు. ఆ సమయంలో చాలా మంది కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నారు. న్యూ ఇయర్‌ రిజల్యూషన్స్‌ పేరిట నిర్ణయాలు ప్రకటిస్తారు. అయితే కొన్ని రోజులు పాటించి ఆ తర్వాత మర్చిపోతారు. అదే మనం తీసుకునే నిర్ణయాలు ఆచరింపదగినవిగా చూసుకుంటే మన జీవితంలో శాశ్వతమైన సానుకూల మార్పును అవి అందిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తీసుకోదగిన తీర్మానాలేంటే తెలుసుకుందాం. వీటి ద్వారా బంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు మన మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన వారమవుతాము. ఇంతకీ అవేంటో ఓసారి చూద్దాం..
ఒక ఏడాది అంటే 365 రోజులని కాదు. 365 అవకాశాలు అని అర్థం. వాటిని అదును చూసి మంచి సందర్భంలో సద్వినియోగం చేసుకోవాలి. చేయాలనుకున్నదేదో ఇప్పుడే చేసి తీరాలి. సాధించాలనుకున్న పనికి వెంటనే పునాదులు వేయాలి. ఈ ఏడాదైనా ప్రతి క్షణం జీవితంలో తృప్తితో గడిపేద్దాం. అలా చేయాలంటే ప్లానింగ్‌ కావాలి. మనల్ని ముందుకు నడిపే దిక్సూచి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు. మనం పెట్టుకునే లక్ష్యం దిశగా అడుగులు వేసే తపన నుంచే వస్తుంది. దాని కోసం మనం చేసే కృషిలో నుంచి వస్తుంది. గత ఏడాది మనం చేసిన పొరపాట్లను విశ్లేషించుకొని చూసుకుంటే వస్తుంది. అనుకున్నది సాధించినప్పుడు కలిగే తృప్తిలో నుంచి వస్తుంది. అందుకే కొత్త ఏడాదిని ఆస్వాదించేందుకు మన లక్ష్యాల సాధన దిశలో అడుగులు వేయాలి.
మానసిక శ్రేయస్సు
ఆధునిక జీవితం శరవేగంగా పరుగెడుతోంది. తీవ్ర ఒత్తిళ్లతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. అందుకే మీ మానసును పదిలంగా ఉంచుకోడానికి, ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయడానికి ఈ కొత్త ఏడాదిలో తీర్మానించుకోండి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా కూడా దృఢంగా ఉండాల్సిన అససరం ఉంది. కనుక మీ శరీరాన్ని ఎక్కువగా కదిలించడానికి, ఆరోగ్యకరమైన బరువును ఉంచుకోడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం డ్యాన్స్‌, ఈత, హైకింగ్‌ వంటి చేయడం అలవాటు చేసుకోవాలి. వీటి ద్వారా శరీరంలో ఎండార్ఫిన్‌లను ప్రేరేపితమవుతుంది. మానసిక ఆనందం కలుగుతుంది. అలాగే ఎక్కువ సమయం ప్రకృతిలో సమయం గడపడం కూడా అంతర్గత శాంతి, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు దోహదపడతాయి.
సానుకూల సంబంధాలు
స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులతో బంధాలను బలోపేతం చేసుకోడానికి ప్రయత్నించండి. అందుకోసం తగిన సమయం, శక్తితో పాటు అవసరం అయితే పెట్టుబడిని కూడా పెట్టండి. కొన్ని సోషల్‌ మీడియా ఫీడ్ల నుంచి ఒత్తిడి నుంచి విముక్తి పొందొచ్చు. ఎక్కువగా స్నేహితులతో సంభాషించడం, టెక్ట్స్‌లు, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ప్రియమైన వారితో నాణ్యమైన సమయం గడపటం చేస్తుండాలి. దీని వల్ల సానుకూల సంబంధాలు పెంపొందుతాయి. ఈ కొత్త ఏడాదిలో ఈ మేరకు ఓ తీర్మానం చేసుకోవచ్చు.
కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి..
జీవితకాల అభ్యాసం వ్యక్తిగత వృద్ధికి శక్తివంతమైన ఉత్ప్రేరకం అని గుర్తుపెట్టుకోవాలి. కనుక వెంటనే మీలోని ఉత్సుకతను రేకెత్తించండి. కొత్త భాషలో ప్రావీణ్యం సంపాదించినా, ఒక కొత్త పరికరాన్ని ఎలా వాడాలో తెలుసుకున్నా, మిమ్మల్ని ఎప్పుడూ ఆకర్షించే రంగంలోకి దిగినా… ఇలా ఏదైనా సరే నేర్చుకోవడం మీ మనసును పదునుగా ఉంచుతుంది. కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. ఆ దిశగా సమయాన్ని కేటాయిస్తూ కొత్త పనులను పెట్టుకోండి.
దాతృత్వాన్ని అలవర్చుకోండి..
మీ సమయాన్ని, ప్రతిభను లేదా వనరులను ఇతరులతో పంచుకోవడం మొదలు పెట్టండి. ఇది మీ జీవితానికి ఓ అర్థాన్ని జోడించడానికి శక్తివంతమైన మార్గం. మీ నైపుణ్యాలను స్వచ్ఛందంగా అందించండి. మీకు నచ్చిన సేవాకార్యక్రమాల కోసం విరాళం ఇవ్వండి. లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. దీనివల్ల దాతృత్వం ద్వారా అందే మనశ్శాంతిని ఆస్వాదించవచ్చు.
చిన్న చిన్న ఆనందాలు
ఆధునిక సమాజం ఎప్పుడు ఉరుకులు పరుగులు పెడుతుంది. డెడ్‌ లైన్లు, పనుల ఒత్తిళ్లతో సతమతం చేస్తుంది. ఈ క్రమంలో చిన్న చిన్న విషయాలను కూడా ఆస్వాదించలేక పోతున్నవారు మన చుట్టూ ఎందరో ఉన్నారు. అందులో మనం కూడా ఉండే ఉంటాం. ఉదయాన్నే ఒక కప్పు కాఫీని ఆస్వాదించలేకపోవడం, వాకింగ్‌ సమయంలో పర్యావరణాన్ని ఆస్వాదించలేకపోవడం, మంచి సంగీతాన్ని ఆస్వాదించలేకపోవడం, మీ ప్రియమైన వారికి ఎటువంటి కారణం లేకుండా ఒక హగ్‌ వంటివి మిస్‌ అవుతూ ఉంటాం. ఈ కొత్త ఏడాదిలోనైనా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను మిస్‌ కాకుండా ఉండేటట్లు చూసుకోవాలి.
మరికొన్ని…
– ఆరోగ్యాన్ని నిజమైన సంపదగా భావించండి. మీకు ఎంత డబ్బున్నా ఆరోగ్యం సహకరించకుంటే మాత్రం జీవితాన్ని ఎపపటికీ ఆస్వాదించలేరు.
– లక్షలకు లక్షలు ఆదాయం ఉండాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. మీ అవసరాలను తీర్చేంత ఉంటే చాలు. మనం అనుకున్న మంచి హౌటల్లో తినడం, నచ్చిన ప్రదేశాలకి వెళ్లి అక్కడి ప్రాంతాన్ని ఆస్వాదించడం, నచ్చిన సినిమాను చూడడం. ఇలాంటి సాకారమయ్యే కోరికలన తీర్చుకోండి. చిన్న అవసరాలకు కూడా ఇతరుల దగ్గర చేయి చాచడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకుని ఒప్పుకోవడమే అవుతుంది.
– అద్దె ఇల్లు ఎంత పెద్దదైనా అది మన అనే ఫీలింగ్‌ను కలిగించదు. మీ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇష్టంగా కష్టపడండి. మీరే స్వయంగా మొక్కలను నాటండి. వాటి ఎదుగుదలను నిరంతరం చూడండి. వాటితో బంధుత్వ భావాన్ని మంచి మనసుతో పెంపొందించుకోండి.
– మీ జీవితంలో మరో మైలు రాయి మీ అభిరుచికి తగిన భాగస్వామిని ఎంచుకోవడం. మీ ప్రయాణంలో అపార్థాలు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా ఇద్దరూ ప్రశాంతతను కోల్పోయే పరిస్థితి అస్సలు తెచ్చుకోవద్దు.
– జీవితంలో మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని చూసి పోల్చి చూసుకోకండి. మీకన్నా చాలా బాగా ఎదిగారు బాగా సంపాదించారు. మంచి పేరు సంపాదించారంటూ ప్రతికూల ధోరణితో కూడిన ఆలోచనలు అస్సలు చేయకండి.
– గాలి కబుర్లు, చెప్పుడు మాటల కోసం వచ్చే వారిని మీ దగ్గరకు రాకుండా నిలుపుదల చేయండి. ఒకవేళ రానిస్తే వారిని మారు వదిలించుకోవాలంటే చాలా అలసిపోతారు. మైండన డిస్టర్బ్‌ అవుతుంది.
– తోటపని, ఆడటం, చదవడం, రాయడం, పాటలు వినడం లాంటి అభిరుచులను పెంపొందించుకోండి. ఇవి మీలో క్రియేటివిటీని పెంచుతాయి.
– ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం 15 నిమిషాల చొప్పున మీ గురించి మీరు ఆత్మ పరిశీలనకు కేటాయించుకోండి. ఉదయం 10 నిమిషాల పాటు మీ మనసును నిశ్చలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మరో ఐదు నిమిషాలు ఆరోజు పూర్తి చేయాల్సిన పనుల జాబితాను తయారు చేసుకోవడానికి కేటాయించండి.