‘నా గుండె జారిపోయిందే..’

'My heart has slipped..'వరుణ్‌ రాజ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘పోకిరి’. మమతా హీరోయిన్‌. వికాస్‌ దర్శకులు. వరుణ్‌ రాజ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డైరెక్టర్‌ వికాస్‌ మాట్లాడుతూ, ‘మేం కథ రాసుకున్నప్పటి నుంచే ‘పోకిరి’ అనే టైటిల్‌ అనుకున్నాం. ఈ సినిమా బాగా హిట్‌ అవుతుందని నమ్ముతున్నాం’ అని అన్నారు. ‘ఈ సినిమాతో గట్టిగా హిట్‌ కొడతాం. ఈ సినిమా హిట్‌ అవుతుందని మాకు కాన్ఫిడెన్స్‌ ఉంది. నేను పవన్‌ కళ్యాణ్‌కే కాదు, చిరంజీవి, మహేష్‌ బాబుకి కూడా అంతే అభిమానిని. ఈ సినిమా టైటిల్‌ లోనే దమ్ముంది. ‘పోకిరి’కి ఓనర్‌ మహేష్‌ బాబే. మేమంతా అభిమానులం అంతే’ అని హీరో, నిర్మాత వరుణ్‌ రాజ్‌ చెప్పారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఉదరు కిరణ్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడటం కన్నా నా మ్యూజిక్‌ మాట్లాడితే బాగుంటుంది అని ఆశిస్తున్నాను. మా సినిమా హిట్‌ కావడం ఖాయం’ అని తెలిపారు.