గొర్రెల బాధిత కుటుంబానికి పరామర్శ

– ఇటీవల రైలు ఢకొీని 50 గొర్రెలు మృత్యువాత
– పరామర్శించిన తెెలంగాణ రాష్ట్ర షిప్స్‌,గోట్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌
నవతెలంగాణ-దారుర్‌
మండల పరిధిలోని దోర్నాల గ్రామానికి చెందిన కిష్టప్ప అనే రైతు ఇటీవల వికారాబాద్‌ జిల్లా దారుర్‌ రైల్వే స్టేష న్‌ సమీపంలో గొర్రెలను మేపుతూ వస్తున్న సమయంలో కిష్టప్ప కురుమ గొర్లు ఒకేసారి రైలు పట్టాల పైకి వెళ్ళగా రె ప్ప పాటు సమయంలోనే, పట్టాలా మీదుగా వేగంగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు 70 గొర్రెలను ఢ కొట్టింది. 50 చనిపో యాయి. రాష్ట్ర షీప్స్‌, గోట్స్‌ ఛైర్మెన్‌ డా దూదిమెట్ల బాల రాజు యాదవ్‌కు ఘటన జరిగిన వెంటనే ఫోన్‌ ద్వారా సమాచారం అందగా జిల్లా పశువైద్యశాఖ అధికారులతో మాట్లాడి ఘటనా స్థలానికి వెళ్లాలని అదేశించారు. మంగళ వారం భాదిత కిష్టప్ప కురుమతో ఫోన్లో మాట్లాడి, ఎలాం టి అందోళనా చెందాల్సిన అవసరం లేదని, అధైర్య పడవ ద్దని ప్రభుత్వం ద్వారా వీలైనంత త్వరగా నష్ట పరిహారం వచ్చేలా న్యాయం చేస్తానని తెలిపారు. సంబంధిత జిల్లా పశు వైద్యశాఖ అధికారి డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి దోర్నాల గ్రామంలోని రైతు కిష్టప్ప నివాసానికి వెళ్లి స్వయంగా మాట్లాడి పరామర్శించి కలెక్టర్‌ కు ఆదేశాలు జారీ చేశానని వివరించారు. ఘటన వివరా లను సేకరించి గాయపడిన గొర్రెలకు చికిత్స అందజే యాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పశు వైద్య అధి కారి డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌, వెటర్నరీ డాక్టర్‌ హరిప్ర ియ, సర్పంచ్‌ సుజాత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.