గత 24 సంవత్సరాలుగా మాలికులస్తులు సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు చేశారని అయిన పూర్తిస్థాయిలో మాలీలకు సామాజిక న్యాయం లభించలేదని దానికోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు లక్షల మంది మాలి కులస్తులు ఏకం కావాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పూలే గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 12న ఆసిఫాబాద్ జిల్లాలో మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగనున్నాయని దానికోసం ఓటర్లుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 250 గ్రామాల్లో నివసిస్తున్న మాలి పెద్దలు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి ఇద్దరు ఓటర్లు ఓటు వేసి రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకుంటారని అన్నారు. అలాగే జనవరి మూడో తేదీన భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు కాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన జరుపుకునీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే, పటేల సంఘం జిల్లా అధ్యక్షులు షిండే గంగారం, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ ఉమేష్ రావు డోలే, జిల్లా కార్యవర్గ సభ్యులు విట్టల్ కొట్రంగే పాల్గొన్నారు.