
మండల కేంద్ర శివారులోని సిద్ధిరామేశ్వర ఆలయ సమీపంలో ఉన్న అయ్యప్ప ఆలయంలో బుధవారం మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.