నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్: నూతన సంవత్సరంను పురస్కరించుకుని గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు బుధవారం కలెక్టర్ రాజర్షి షా ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు నోట్ బుక్స్ అందచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ.. 2025 సంవత్సరములో నూతన ఉత్తేజంతో జిల్లా ప్రగతి కి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ రామారావు అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్స్ రాజేష్, వామన్, కోశాధికారి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీస్ అనిల్, నరేష్ , మహిళా జాయింట్ సెక్రటరీ వినూత్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్, ఈసి మెంబర్ నరేష్ పాల్గొన్నారు.