ఆంగ్ల సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఎమ్మెల్యే పాయల శంకర్ ఆకాంక్షించారు. బుధవారం శాంతినగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంత్సవరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్టీయూ సంఘం నూతన క్యాలెండర్ తో పాటు డైయిరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయా సంఘాల నూతన క్యాలెండర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో కీలకంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కరం కావాలన్నారు. దీని కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అదే విధంగా జిల్లా, నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేల తన వంతు కృషి చేస్తానన్నారు. ఇదిలా ఉంటే సరస్వతి శిశుమందిర్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సనాతన హిందూ ఉత్సవ సమితి నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి స్వీట్లు తినిపించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ ఖత్రి, గౌరవ అధ్యక్షుడు బండారి వామన్, ప్రధాన కార్యదర్శి మహాదవ్, రేణికుంట్ల రవీందర్, సుభాష్, టీఎన్జీవోస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, నవీన్, ఎస్టీయూ నాయకులు రవీరంద్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
కంది భవన్ లో..
పట్టణంలోని ప్రజాసేవ భవన్ లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు, పార్టీ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయంలో ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలు సంతోషంగా ఉండి.. పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా ప్రజల విశ్వసనీయత పొందిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరింత మెరుగైన పాలన అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.