హమాలీ కార్మికులకు కూలి రేట్లు పెంచి ఇవ్వాలి..

Wages should be increased for porters.– నిరవధిక సమ్మె 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
సివిల్ సప్లై హమాలీ కార్మికుల కు కూలీరెట్లు పెంచివ్వాలని సివిల్ సప్లై హమాలీ కార్మికులు అన్నారు. తంగళ్ళపల్లి మండలంలోని కాలనీ సివిల్ సప్లై గోదాముల వద్ద సివిల్ సప్లై హమాలీ కార్మికులు బుధవారం నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ కార్మికులకు కూలి రేట్లు పెంచి వాళ్ళని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరవధిక సమ్మె ఇలానే కొనసాగుతుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.ఈ సమ్మెలో అధ్యక్షులు పుప్పాల రాజేష్,ఉపాధ్యక్షులు  మల్లేశం,కార్యదర్శి  శివలింగ,దేవయ్య,నక్క రాములు,రాజయ్య,రాజిరెడ్డి, నూనె వెంకటేశం,రాగుల భద్రయ్య,పుప్పాల జక్కయ్య ,జంగపల్లి వెంకటేశం,మహేష్,దుర్గయ్య  పాల్గొన్నారు.