భీమ కోరేగావ్ సౌర్య విజయ దివాస్ వేడుకలు..

Bhima Koregaon Sourya Vijaya Divas Celebrations..– దళితుల ఆత్మగౌరవ పోరాట విజయమే భీమా కోరేగావ్
– సమతా సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు
జనవరి 1వ తేదీన 205 సం.శౌర్య విజయ దివస్ ను పురస్కరించుకొని అమరవీరుల స్తూపం దగ్గర భీమా కోరేగావ్ యుద్ధ వీరులను స్మరించుకుంటూ నేతకాని మహర్ సేవా సంఘం, సమతా సైనిక్ దళ్, భారతీయ బౌద్ధ మహాసభ, అంబేడ్కర్ సంక్షేమ సంఘం, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి,కోవత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహర్ వీరుల వీరత్వాన్ని చరిత్రను గుర్తు చేస్తు బడుగు బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన రోజు 1818 జనవరి 01 ప్రతి ఒక్కరు తెలుసుకొని కుల వివక్ష చూపించిన పీష్వా రాజులపై మహర్ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్ అని పేర్కొన్నారు.500 వందల మంది మహర్ వీరులు 28 వేల మంది పీష్వా సైన్యంతో మహారాష్ట్ర కోరేగావ్ లోని భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారు. వేల సం.ల బానిస సంకెళ్లు తెంచుకోవాలని ప్రతిజ్ఞ భూని 500 మంది మహర్ సైన్యం, 200 మంది బ్రిటిష్ సైన్యంతో కలిసి 200 కిలోమీటర్ల నడిచి భీమా నది ఒడ్డుకు చేరుకున్నారు. 20 వేల మంది పదాతి దళం, 8000 మంది అశ్విక దళంతో కనుచూపుమేరలో కనిపిస్తున్న పీష్వా సైన్యాన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. కానీ బతికితే పోరాట వీరులుగా బతకాలని లేదంటే హీనమైన బతుకులతో చావాలని నిర్ణయించుకున్న మహర్ సైన్యం పీష్వా సైన్యంతో యుద్ధానికి తలపడింది. తిండి లేకుండా కాలినడకన వచ్చి కూడా మహర్ సైన్యం సింహం లాగా పిష్వా సైన్యాన్ని ఎదుర్కోవడాన్ని చూసి బ్రిటిష్ లెఫ్ట్నెంట్ కాల్నల్ ఆశ్చర్యపోయి భీకర పోరాటంలో భీమా నది ఎర్రబడింది. పీష్వా సైన్యం వెనక్కి తగ్గింది. అమరులైన మహర్ సైనికులకు బ్రిటిష్ వారు స్మారక స్తూపం కట్టించడమే కాకుండా మహర్ సైనికులతో మహర్ రెజిమెంట్ ఏర్పాటు చేశారు. డా”అంబేద్కర్ జీవించి ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం జనవరి 01 వ తారీకున కోరేగావ్ వచ్చి మహర్ వీరుల విజయోత్సవ స్థూపం దగ్గరే రోజంతా గడిపేవారాని అన్నారు. వారి చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆచరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం సిద్ధార్థ రాంమ్మూర్తి,నేతకాని మహార్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం స్వామి,ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.