సంస్కృతి విభాగం మండల కన్వీనర్ గా నరసింహాచారి ..

Culture Department Mandal Convenor Narasimhachari..నవతెలంగాణ -తాడ్వాయి 
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పబ్బోజు నరసింహ చారి( సూరి)ని మంగళవారం పార్టీ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ సంస్కృతిక విభాగం మండల కన్వీనర్ గా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు బోల్లు దేవేందర్, తెలిపారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ నరసింహ చారి, కాంగ్రెస్ పార్టీ పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాడని అన్నారు. ఆయన కష్టాన్ని గుర్తించి సంస్కృతి కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు నా ఎన్నికకు సహకరించిన మంత్రి సీతక్క బొల్లు దేవేందర్ ముదిరాజ్ కు నరసింహ చారి, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోమేడారం ట్రస్ట్ బోర్డుచైర్మన్ అరేం లచ్చు పటేల్, బ్లాక్ కాంగ్రెస్  మాజీ అధ్యక్షులు ఎండి ముజాఫర్ ఖాన్, సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోడి సతీష్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్లు. యానాల సిద్ది రెడ్డి, జగన్, రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.