‘దబిడి..దిబిడి’ పక్కా మాస్‌ సాంగ్‌

'Dabidi..Dibidi' is a pure mass songబాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘డాకు మహారాజ్‌’. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడు దలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టు కున్నాయి. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా, రెండింటికీ మంచి స్పందన లభించింది. ఇక మూడవ గీతం ‘దబిడి దిబిడి’ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఒక ఊపు ఊపుతోంది. బాలకృష్ణ అంటే డైలాగ్‌లకు పెట్టింది పేరు. అలాంటి బాలకృష్ణ చిత్రాలలోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్‌లతో రూపుదిద్దుకున్న ‘దబిడి దిబిడి’ పాట అభిమానులను నిజమైన కనువిందు చేస్తోంది. ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌతేలా ఆడి పాడారు కదిపారు. బాలకృష్ణ సినిమా అంటే తమన్‌ ఏ స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ‘దబిడి దిబిడి’ కోసం తమన్‌ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వాగ్దేవి తన శక్తివంతమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. గీత రచయిత కాసర్ల శ్యామ్‌ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు అని చిత్రయూనిట్‌ తెలిపింది. బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్‌ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈనెల 12న భారీస్థాయిలో విడుదల కానుంది.