పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలి ..

Pending bills should be released immediately..– డిటిఎఫ్ మండల అధ్యక్షుడు ఎం రాజు 
నవతెలంగాణ – నెల్లికుదురు
ఈ కుబేరులు పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చేసి పెండింగ్ లో ఉన్న డి ఏ లను తక్షణమే ప్రకటించాలని జిల్లా కౌన్సిలర్ పి యాదగిరి, డిటిఎఫ్ మండల అధ్యక్షుడు ఎం రాజు కోరినట్లు తెలిపారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డైరీ మరియు క్యాలెండర్ ను ఎంఈఓ రామదాస్ మరియు ఇన్చార్జి హెడ్మాస్టర్ జలగం శ్రీనివాస్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడంలో డిటిఎఫ్ పాత్ర కచ్చితంగా పోషిస్తుందని తెలిపారు.ఈ కుబేర్ లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్న  డి ఏ లను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. విద్యా సంవత్సరం దాదాపు చివరిదశకు వచ్చిన ఇంతవరకు కూడా వర్క్ అడ్జస్ట్మెంట్ జరగకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని వెంటనే వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలని మండల విద్యాశాఖ అధికారి నీ కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ సభ్యులు పి రవీందర్, డి రమేష్ ,రాజశేఖర్ ఎం సుధాకర్, అమర్ ,సంజీవరావు, పుష్పనీలా తదితరులు పాల్గొన్నారు.