ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి..

Everyone should be aware of traffic rules.– శ్రీ వాసవి పాఠశాల విద్యార్థులకు ఆర్టీవోలు అవగాహన..

నవతెలంగాణ – మద్నూర్
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఆర్టిఓ లు రజిని, గంగామణి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ రహదారి మహోత్సవాలలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి హై స్కూల్ లో శుక్రవారం నాడు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీవోలు రజిని గంగామణి రోడ్డు నియమ నిబంధనల గురించి ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించారు ప్రతి సంవత్సరం ఆరు లక్షల మంది రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నియమాలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని ట్రాఫిక్ నియమాలు కలిగి ఉండాలని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో పాఠశాల కరస్పాండెంట్ ఉమాకాంత్ పాఠశాల డైరెక్టర్ శశికాంత్ ప్రిన్సిపాల్ వినోద్ కుమార్ స్నేహ ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.