జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి..

Take advantage of the job fair.– ఎంపీడీవో జవహర్ రెడ్డి, తాహసిల్దార్ సృజన్ కుమార్
నవతెలంగాణ – గోవిందరావుపేట
జాబ్ మేళాను నిరుద్యోగులైన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి అధికారులు ఎంపీడీవో జవహర్ రెడ్డి తహసిల్దార్ సృజన్ కుమార్లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జాబ్ మేళా ఇన్చార్జి అధికారులైన జవాన్ రెడ్డి దివిజన్ కుమార్ లు  మాట్లాడుతూ.. ఈనెల 7న మండల కేంద్రంలో ఉదయము 9 గంటల నుండి సాయంత్రం వరకు పిఎస్ఆర్ గార్డెన్స్ సోమల గడ్డ క్రాస్ రోడ్డు చల్వాయి నందు మెగా జాబ్ మేళాను మంత్రివర్యులు  దనసరి అనసూయ (సీతక్క) పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చే ప్రారంభం చేసి  జిల్లా కలెక్టర్ ములుగు  ఆధ్వర్యంలో నిర్వహించబడునని అన్నారు.ఈ సదవకాశమును ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు అర్హత కలిగి ఆసక్తిగల వారు నిజ ధ్రువీకరణ పత్రములతో హాజరగుటకు కోరనైనదనీ సూచించారు. ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు పదో తరగతి నుండి పీజీ వరకు ఉత్తీర్ణత అయిన వారికి వివిధ 36 ప్రైవేటు కంపెనీల నందు నేరుగా ఉద్యోగాలు కల్పిస్తూ మరియు ఉచితముగా 30 రోజుల శిక్షణ ఇస్తూ అనంతరం ఉద్యోగ అవకాశం కల్పించే సంస్థలు ములుగు మెగా జాబ్ మేళాకు విచ్చేయుచున్నారు. వివిధ సెక్టార్లు అనగా ఐటీ సెక్టార్ నెట్వర్క్ ఇంజనీర్ బ్యాంకింగ్ సెక్టార్ ఫార్మసీ మెకానికల్ ఇంజనీర్ నెట్వర్క్ ఇంజనీర్ క్వాలిటీ ఇంజనీర్ క్వాలిటీ మెకానికల్ ఇంజనీర్ అసెంబ్లీ ఆపరేటర్ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ ఇంటర్ షిప్ ఆడిట అసిస్టెంట్స్  సేల్స్ ఎగ్జిక్యూటివ్ మిషన్ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్స్ ఫీల్డ్ టెలికాలర్ కస్టమర్ సేల్స్ సెక్యూరిటీ గార్డ్ సేల్స్ ఆఫీసర్ స్కాన్ కోడ్ అసిస్టెంట్ డెలివరీ బాయ్స్ మొదలగు సుమారుగా 15 వేల ఉద్యోగాలను ప్రైవేట్ సంస్థల ద్వారా భర్తీ చేసి రాష్ట్రంలోని వివిధ పట్టణ ప్రాంతాలలో నెలకొని ఉన్న ప్రైవేటు కంపెనీలలో ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశమును వినియోగించుకోవాలని ఈ యొక్క ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచినారన్నారు.కావున  జిల్లా కలెక్టర్ ములుగు  ఆదేశాల మేరకు ఈ మెగా జాబ్ మేళా అవకాశాన్ని ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకొని వారి యొక్క కుటుంబాలకు తోడ్పాటుగా ఉండి సమాజంలో  గౌరవంగా గుర్తింపుతో జీవించాలని కోరనైనదనీ తెలిపారు.