ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..

Celebrating Women's Teacher's Dayనవతెలంగాణ – మల్హర్ రావు
మహిళ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సువిద్య హైస్కూల్లో ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే జన్మదినం పులిస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా జనవరి మూడును ప్రకటించింది. ఈ సందర్భంగా పాఠశాలలో సావిత్రిబాయి పూలే చరిత్రను విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు వివరించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి వేశారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులైన సావిత్రిబాయి పూలే దేశంలో మొట్టమొదట విద్యార్థినిల కోసం పాఠశాల ప్రారంభించిందని విద్యార్థులకు తెలిపారు. పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ కొట్టి శ్రీశైలం పాఠశాల డైరెక్టర్ కొట్టే పుష్పలత సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మహేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గడి జ్యోతి పాల్గొన్నారు.