జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే క్రాస్ చెకింగ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో, రెంజల్ ఎంపీడీవో వెంకటేష్ యాదవ్ శుక్రవారం మండలంలోని మౌలాలి తాండ, తాడి బిలోలి గ్రామాలలో క్రాస్ చెకింగ్ నిర్వహించారు. ఇటీవల గ్రామ కార్యదర్శులు ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పూర్తి చేసిన అనంతరం క్రాస్ చెకింగ్ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు..