నవతెలంగాణ – బాల్కొండ : నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం వారి ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని శ్రీరాంపూర్ గ్రామంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ ఏఎస్ఐ శంకర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలనీ, మైనర్ విద్యార్థులు వాహనాలు నడపరాదని సూచించారు. మహిళల భద్రత కోసం రక్షణగా నిజామాబాద్ షీ టీమ్ రక్షణ కల్పిస్తుందనీ తెలిపారు.మహిళలు అత్యవసర పరిస్థితుల్లో నిజామాబాద్ షీ టీమ్ నంబర్ 8712659795 ,డయల్ 100 కి ఫోన్ చేయాలని అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ దొంగిలించిన, పోగొట్టుకున్న సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరి చేయడం జరుగుతుందినీ తెలిపారు.ఆన్లైన్, సైబర్ మోసాలు గురించి అప్రమత్తంగా ఉండాలని వివరించారు,దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఫిర్యాదు చేయాలని తెలిపారు. కళాబృందం వారు గ్రామస్తులకు చక్కని నాటిక, పాటల రూపంలో సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో బాల్కొండ ఏఎస్ఐ శంకర్, గ్రామస్తులు, పోలీస్ కళాబృందం పాల్గొన్నారు.