మహిళలకు ఉచిత ప్రెషర్ కుక్కర్ ల పంపిణీ..

నవతెలంగాణ కంఠేశ్వర్ : స్థానిక బర్కత్ పుర నందుగల రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో వివిధ సంస్థలలో పనిచేసే మహిళల కై ఉచిత ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు అధ్యక్షులు బిరెల్లి విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమము కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ క్రింద మహారాష్ట్ర పూణేకి చెందిన గేర్ వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్ వారు సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది మరియు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫౌండర్ సభ్యులు మధన్ లాల్ గుప్తా గారు హాజరై మాట్లాడుతూ గత 70 సంవత్సరాలకు పైగా నిజామాబాద్ రోటరీ క్లబ్ దిన దినాన సమాజంలో ప్రత్యక్షంగా పరోక్షంగా క్లబ్ ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మొదట సభ్యులకు అభినందనలు తెలిపారు. తదనంతరం ఇలాంటి సి.ఎస్.ఆర్ ప్రోగ్రాం ల ద్వారా మహిళలకు లబ్ధి చెందడం అభినందించ దగ్గిన విషయమని అన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా నిజామాబాదు గేర్ వేర్ సంస్థకి చెందిన డిస్ట్రిబ్యూటర్ రాజగోపాల్ గిల్డ, రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు రమేష్ గిల్ద లు హాజరయ్యారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, బాబురావు, జ్ఞాన ప్రకాష్, కమల్ గిల్డ, నర్సింగ్ రావు, శ్రీరామ్ సోనీ, సతీష్ షా, జితేంద్ర మలాని, గోవింద్ జవహర్ తదితర సభ్యులు మరియు లబ్ధిదారులు అందుకు సంఖ్యలో పాల్గొన్నారు.