నువ్వులు మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. చలికాలంలో ముఖ్యంగా నువ్వులు తినడం చాలా మంచిదని చెబుతారు. అందుకే దీనిని ఈ కాలపు సూపర్ ఫుడ్‌గా కూడా చెబుతారు. ఇందులో ఉండే పోషకాలు అనేక అనారోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడతాయి.
నువ్వులలో క్యాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు తదితరాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఐరన్, ఫాస్పరస్, జింక్, కాపర్ వంటి అనేక పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి.
ఎముకలకు పుష్టి
నువ్వులలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాల కంటే అధికంగా కాల్షియం ఉన్న నువ్వులు తినడం వల్ల ఎముకలు దఢంగా మారతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుండి నువ్వులు మనకు ఉపశమనం కలిగిస్తాయి. దంతాలకు కూడా బలం చేకూరుతుంది.
ఈ సమస్యకు చెక్
ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడే వారికి చాలా బాగా పనిచేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు ఒక స్పూను నువ్వులను తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా నువ్వులు ఎంతో బాగా ఉపయోగపడతాయి. శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్‌ను పెంచడానికి కూడా నువ్వులు దోహదం చేస్తాయి.
వ్యాధి నిరోధక శక్తి..
నువ్వులలో జింక్ పుష్కలంగా ఉండడంవల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి మనల్ని జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి. చలికాలంలో మన శరీరం పైన దాడి చేసే అనేక ఇన్ఫెక్షన్లను రాకుండా ఇవి కాపాడతాయి. ఇందులో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం హైబీపీని నియంత్రిస్తాయి. అలాగే ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మన గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
గుండె జబ్బులకు చెక్
గుండెజబ్బులు రాకుండా మనలను కాపాడతాయి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి నువ్వులను ప్రతిరోజు ఒక స్పూను తింటే చాలు, లేదా ప్రతిరోజు ఒక నువ్వుల ఉండనైనా తింటే చాలు మన ఆరోగ్యంలో వచ్చే మార్పును మనం ఇట్టే గమనించవచ్చు.
వాతావరణం మారినప్పుడు తరచుగా దగ్గు వస్తుంటే నువ్వులను తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. నువ్వుల కషాయాన్ని తాగడం వల్ల దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. నువ్వులు, పంచదార ఉడికించి తాగితే పొడి దగ్గు నయమవుతుంది.
ఇవి చర్మాన్ని స్మూత్‌గా, జుట్టును బలోపేతం చేయడంలో బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే జింక్ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. ఇది చర్మం, జుట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు నువ్వుల లడ్డులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది వద్ధాప్యాన్ని తగ్గిస్తుంది.