– హైదరాబాద్‌పై రికార్డు 426 పరుగులు
అహ్మదాబాద్ : విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ ధనాధన్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో రెండు సార్లు 400 ప్లస్ పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. తొలుత సౌరాష్ట్రపై 424/5 పరుగులు చేసిన పంజాబ్.. శుక్రవారం హైదరాబాద్ 426/4 పరుగులు బాదింది. ప్రభు సిమ్రన్ సింగ్ (137), అభిషేక్ శర్మ (93), రమణ్‌దీప్ సింగ్ (80), అన్మోల్ప్రీత్ సింగ్ (46), నేహల్ (35 నాటౌట్) దంచికొట్టారు. ఛేదనలో హైదరాబాద్ 47.5 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డి (111), తనరు (74) రాణించారు. గ్రూప్-సిలో ఆరు మ్యాచుల్లో హైదరాబాద్‌కు ఇది మూడో ఓటమి. ఆదివారం జరిగే ఆఖరు మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో హైదరాబాద్ తలపడనుంది.